పెళ్లికి ముందే అన్నీ చేసేశాం..! ఆ సీక్రేట్ ని బయటపెట్టిన లావణ్య.

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్స్, ఫ్యామిలీ ట్రిప్స్ వేసి ఇప్పుడిప్పుడే సినిమా వర్క్స్ మళ్ళీ మొదలుపెట్టారు. అయితే నిన్న వాలెంటైన్స్ డే కావడంతో, వరుణ్ లావణ్యలకు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి వాలెంటైన్స్ డే కావడంతో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. అయితే లావణ్య త్రిపాఠి ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తన లవ్ ఎఫైర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠికి తొలిప్రేమ సినిమాలో రాశీఖన్నాకు ప్రపోజ్ చేసినట్టు తనకు కూడా ప్రపోజ్ చేశాడట.

ఇక మిస్టర్ సినిమా షూట్ సమయంలో మొదట ఫ్రెండ్స్ అయ్యామని ఆ తర్వాత లవ్ లో పడ్డామని మిస్టర్ షూట్ పూర్తయ్యే సమయానికి వరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడని ఆమె ఇటీవల ఓ ఇంటర్వూలో తెలిపారు. ఫ్లవర్ ఇచ్చి వరుణ్ తేజ్ ప్రపోజ్ చేయడంతో లావణ్య త్రిపాఠి ఫిదా అయ్యారట. అలా ఆమె వరుణ్ తేజ్ లవ్‌లో పడిపోయిందట లావణ్య. ఇక వీరి వివాహాం ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్, గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు. అందులో భాగంగా 2023 జూన్‌ 09న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది.

నవంబర్ 01న వివాహ బంధంతో ఒక్కటైయ్యారు.ఇక వరుణ్, లావణ్యల పెళ్లి విషయానికి వస్తే.. ఈ జంట దాదాపుగా ఆరేళ్ల పాటు ప్రేమించుకుని.. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక అంగరంగ వైభంగా జరిగింది. వరుణ్ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. ఇక లావణ్య పెళ్లిలో లావణ్య ధరించిన ఈ చీరను ప్రముఖ సెలెబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారట.

ఇక ఈ చీర ధర దాదాపు 9 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌ను జరుపుకున్నారు. అందులో భాగంగా వరుణ్, లావణ్యలు తమకు ఇష్టమైన దేశం ఇటలీలో పెళ్లి చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *