అమర్ దీప్, అశ్విని, హర్ష, శోభాశెట్టి, గీతూ.. ఇలా పలువురు కంటెస్టెంట్స్ కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేసి కార్ అద్దాలు పగలకొట్టి డ్యామేజ్ చేశారు. దీనిపై కంటెస్టెంట్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గీతూ అయితే అక్కడ ఉన్న యూట్యూబ్ మీడియాతోనే ఈ దాడిపై మాట్లాడింది. తర్వాత తన సోషల్ మీడియాలో కూడా తన కార్ పగలకొట్టిన వాడ్ని పట్టుకుంటే పదివేలు ఇస్తా అని పోస్ట్ చేసింది.
ఇక అశ్విని తన కార్ ని డ్యామేజ్ చేసారంటూ, కొత్త కార్ అంటూ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ ఫ్యామిలీ కార్ పై కూడా దాడి చేసి బయటకి దిగమంటూ రచ్చ చేశారు. దీంతో అమర్ ఫ్యామిలీ భయపడ్డారు. మిగిలిన కంటెస్టెంట్స్ వారిపై జరిగిన దాడికి స్పందించాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసిన వీడియోలు ప్రస్త్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీంతో నెటిజన్స్, వేరే కంటెస్టెంట్స్ అభిమానులు పల్లవి ప్రశాంత్ అభిమానులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక అమర్ దీప్ విన్ అవ్వాల్సింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ ప్రశాంత్ ఫ్యాన్స్ కి భయపడి అతని ఇచ్చారు అని కూడా పలువురు ఆరోపిస్తున్నారు.