బిగ్ బస్ హిస్టరీలోనే తొలిసారి ఒక సామాన్యుడు.. ఒక రైతు బిడ్డ విజేతగా నిలిచాడు. నిజానికి ఇలా నిలిపింది కేవలం నటుడు శివాజీనే. తొలి వారం నుంచే ఎవరూ మాట్లాడకుండా సామాన్యుడిలా ఉన్న పల్లవి ప్రశాంత్ ను వెనకేసుకొచ్చి అతడిని సానబట్టి ఫైనల్ వరకూ తీసుకొచ్చి విజేతగా నిలిపింది శివాజీ. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్.
తెలుగులోనే కాకుండా.. దేశ చరిత్రలో ఒక సామాన్యుడు.. అందులోనూ అన్నదాత బిగ్‌బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి. ‘అన్నా మల్లొచ్చినా.. నేను బిగ్‌బాస్‌కి వెళ్లానన్నా.. అన్నా రైతు బిడ్డనన్నా.. నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండన్నా’ అని వింత వింత చేష్టలతో వీడియోలు పెడుతూ ఉంటే అతడిని చూసిన వారు.
వీడేవడో తింగరోడిలా ఉన్నాడు.. పైగా బిగ్ బాస్ కు వెళ్లడమే తన జీవిత లక్ష్యం అంటున్నాడు.. పని పాట ఏం లేదా అని ఇసడించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఎవరూ ఏం అనుకున్నా.. ప్రశాంత్ మాత్రం ఎలాగోలా కష్టపడి చివరకు బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.