శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్ లో రిసెప్షన్ ను నిర్వహించడం గమనార్హం. “క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి. తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం” అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఈ వీడియోలో షర్మిల సంతోషంగా డ్యాన్స్ లు వేయడం గమనార్హం.
ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొడుకు పెళ్లి సంతోషం అంతా షర్మిల కళ్లలోనే కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో షర్మిల రాజకీయాలపై దృష్టి పెట్టారు. సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్న కొంతమందిపై షర్మిల ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీలోని అన్ని స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసేలా షర్మిల ప్రణాళిక ఉంది. షర్మిలకు ఏపీలో 3 శాతం ఓటింగ్ ఉందని పలు సర్వేల ద్వారా వెల్లడవుతోంది. షర్మిల ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది.
#RajaPriya
— YS Sharmila (@realyssharmila) February 25, 2024
క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి .. తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం pic.twitter.com/zrnyOCDV1B