నగరిలో రోజాకు సీటు లేదని ప్రచారం చేసే వారికి ఎక్కడ పోటీ చేయాలో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో రెండేసి చోట్ల పోటీ చేయడానికి సర్వేలు చేయిస్తున్నారన్నారని ఆరోపించారు. 2024లో వైసీపీ 175 సీట్లలో తమ పార్టీ గెలుస్తుందని చెప్పారు.
తనపై కథనాలు రాసేవారికి శునకానందం మాత్రమే మిగులుతుందని మంత్రి రోజా చెప్పారు. తన కార్యకర్తలు, అభిమానులకు తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానో స్పష్టత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నగరి నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పారు.
రాష్ట్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నది తానేనని మంత్రి రోజా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ లేదనే ప్రచారాలను నమ్మొద్దన్నారు. అయితే