యువతులకు ఉద్యోగాల పేరుతో వల విసిరి.. స్పా సెంటర్లకు తీసుకువచ్చి వ్యభిచారకూపంలోకి దించుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బ్యూటీపార్లర్, స్పా సెంటర్లకు వచ్చే కస్టమర్ల పేర్లు, ఫోన్ నంబర్ల వివరాలు నమోదు చేసుకునేందుకు రిజిస్టర్ మెయింటెన్ చేస్తారు. అయితే హైదరాబాద్ లో హ్యూమల్ ట్రాఫికింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ తీసుకువచ్చి వ్యభిచార ఉచ్చులో దించిందో ముఠా. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహిళల అక్రమ రవాణా దేశంలో పెద్ద నేరమన్నారు. మహిళలను అక్రమ రవాణా చేసి వ్యభిచారం కుంపటిలో దింపుతున్న ముఠాను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.
ఉప్పల్ పోలీసులతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందన్నారు. ఉప్పల్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు విచారణ చేశామన్నారు.