సుదీర్ఘకాలంపాటు భారత టెన్నిస్‌కు విశేషమైన సేవలు అందించిన సానియా మీర్జా.. దిగ్జజ టెన్నిస్ ప్లేయర్‌గాను ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. సుదీర్ఘ కెరియర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్స్‌లో సాధించిన సానియా మీర్జా.. గొప్ప టెన్నిస్ ప్లేయర్‌గా దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు.
2009లో తొలి ఆస్ర్టేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజయం దక్కించుకున్న సానియా మీర్జా.. ఆ తరువాత అనేక విజయాలను తన పేరిట నమోదు చేసుకున్నారు. నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో భారత్ తరపున పాల్గొని జాతీయ జెండాను రెపరెపలాడించిన ఘనతను సానియా మీర్జా దక్కించుకున్నారు.
కుటుంబ వ్యవహారాలు, ఇతర కారణాలతో కొన్నాళ్ల కిందట సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలికారు. సానియా తరువాత ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఆ స్థాయిలో క్రీడాకారులు ఎవరూ లేకపోవడంతో ఆ స్థానం ఖాళీగానే కనిపిస్తోంది.