మాధవీ లత మొన్నటికి మొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అప్పట్లో ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇప్పుడు ఈమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
సినిమాలు చేయ్యడం లేదుకదా మరి డబ్బులు ఎక్కడినుంచి వస్తునాయని చాల మంది మాధవీని అడుగుతున్నారంట. ఈ విషయం పై మాధవీ లత స్పందిస్తూ ”మేము చదువుకున్నాము డబ్బులు సంపాదించడం మాకు కూడా తెలుసని, అంతేకానీ అమ్మాయిలకు డబ్బులు అంటే కేవలం పడుకుంటేనే వస్తాయా.. ముందు మీరు మారి చావండ్రా” అంటూ రెచ్చిపోయింది.
మీకు సిగ్గు లేదు.. అమ్మాయిల గురించి అలా ఆలోచించడానికి.. మీ అమ్మ, అక్క, పెళ్లాంకు ఎక్కడ్నుంచి వస్తున్నాయిరా డబ్బులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ముందొకసారి మాధవీ లత కూడా పడుకోకపోతే అవకాశాలు రావంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.