శివాల‌యంలో పాలు తాగుతున్న నంది విగ్రహం. ఎలానో మీరు చుడండి.

శివుని విగ్రహానికి ఒక గ్లాసు నీళ్ళు సమర్పించాడు. కుండలోని నీరంతా దేవుని విగ్రహంలో కలిసిపోయింది. చుక్క నీరు కూడా పడలేదు. ఈ అద్భుతాన్ని చూసిన యువకుడు వెంటనే మా వద్దకు వచ్చాడు. క్రమంగా ఈ విషయం ఊరంతా వ్యాపించింది. ఈ ప్రాంత ప్రజలు పాల పాత్రతో ఆలయానికి రావడం ప్రారంభించారు. భోలేనాథ్, తల్లి పార్వతి మరియు నందికి చెంచాతో పాలు, నీరు తాగించడం ప్రారంభించారు.

అయితే దేవుడి విషయంలో ఎన్నో నమ్మలేని విష‌యాలు వింటుంటాం.. చూస్తుంటాం… ఎలాగంటే గణేశుడి విగ్రహం పాలు తాగడం, సాయిబాబా విభూతి రాల్చడం.. శ్రీరాముడి విగ్రహం కన్నీళ్లు పెట్టుకోవడం.. ఇలా ఎన్నెన్నో విచిత్ర సంఘటనలు మన కళ్లెదుటే జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటిదే.. శివుడి దగ్గర ఉండే నంది విగ్రహం పాలు తాగుతుందట ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వింత ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని క్రాంతినగర్, గాండ్ల సంఘం శివాలయంలో భక్తులు నందికి పాలు పోశారు.

ఎన్నడూ లేనిది నంది పాలు తాగడం మొదలుపెట్టింది. అది గమనించిన భక్తులు గిన్నెలు, చెంచాలతో నందికి పాలు తాగించారు. అయితే.. నిజంగా నంది పాలు తాగుతోందా ? లేదంటే విగ్రహం పాలను పీల్చేస్తుందా ? అన్న సందిగ్ధం నెలకొంది. శివాలయంలో ఉన్న నందీశ్వరుడు పాలు తాగేస్తున్నాడనే విషయం తెలుసుకున్న ప్ర‌జ‌లు నందికి పాలు తాగించేందుకు, ఆ వింతను కళ్లారా చూసేందుకు క్యూ కడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *