తండ్రి మోహన్ బాబు నట వారసత్వం అబ్బకున్నా అతి మాత్రం ఒంటబట్టింది. మంచు లక్ష్మి కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నిలబడలేదు. ఆమెకు కనీస ఇమేజ్ లేదు. తనను టాప్ సెలెబ్ లా ఫీల్ అవుతుంది. నలుగురైదుగురు హీరోయిన్స్ తో స్నేహం కొనసాగిస్తూ, తాను కూడా టాప్ హీరోయిన్ అనుకుంటుంది. అయితే మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు కుమార్తెగా ఆమె అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే విలనిజాన్ని చూపించి అవార్డులను కూడా అందుకుంది.
ఇక ఈ సినిమా తరువాత నటిగా, నిర్మాతగా విజయాపజయాలను పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం మంచక్క .. మోహన్ బాబుతో కలిసి అగ్ని నక్షత్రం అనే సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంచక్క అరాచకం మాములుగా ఉండదు. నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. విమర్శలను పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం .. మంచు లక్ష్మీ బాలీవుడ్ పై కన్నేసింది. అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయడానికి ఆమె.. హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చిందని సమాచారం.
ఇక తాజాగా ఈ వార్తపై మంచు లక్ష్మీ స్పందించింది. ముంబైకు మకాం మార్చిన విషయం నిజమే అని ధ్రువీకరించింది. ‘కొత్త నగరం, కొత్త యుగం. ఈ జీవితానికి చాలా కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ నన్ను ఆదరిస్తున్నందుకు మరియు నన్ను విశ్వసిస్తున్నందుకు నా అభిమానులందరికీ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో అభిమానులు బాలీవుడ్ ను ఏలడానికి వెళ్ళావా అక్కా అని కొందరు.. అక్కడ మంచు పేరు నిలబెట్టాలి అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మంచు లక్ష్మీ అక్కడ ఎలాంటి వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తుందో చూడాలి.
New City, New Era. Super grateful for this life🙏🏼❤️ Thank you to all my fans for always supporting and believing in me🥰#mumbai@mid_day @upalakbr999 https://t.co/u5iratnPzy
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) October 12, 2023
