ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి.. ఆ తర్వాత ఆ మ్యాజిక్ చేయలేదు. మహా సముద్రం ఫ్లాప్ కావడంతో.. దాదాపు మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని మంగళవారం సినిమాతో వచ్చాడు.
“గోదావరి నేపథ్యంలో .. పొంగుతున్న వాగు నేపథ్యంలో .. మంటలు చెలరేగుతున్న పొలాలకు సంబంధించిన షాట్స్ ను, నెక్స్ట్ లెవెల్ మేకింగ్ ఆడియన్స్ కి చూపించాలనే ఉద్దేశంతో చేశామని అజయ్ భూపతి అన్నాడు. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుందని ఆయన చెప్పాడు.
ఈ సినిమాల్లో ‘మంగళవారం’ సినిమాకి ఎక్కువ బజ్ కనిపిస్తోంది. గోదావరి తీర ప్రాంతం .. గ్రామీణ నేపథ్యం .. ఆ విలేజ్ లోని వివిధ చీకటి కోణాలు ఈ కథలోని అంశాలుగా కనిపించనున్నాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు కనిపిస్తున్నాయి.