క్యాన్సర్… ఈ వ్యాధి పేరు వింటే చాలు, కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు.. చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి.
తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. క్యాన్సర్ ప్రాణాలను సైతం బలితీసుకుంటుంది. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు.. ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు ఈ వ్యాధి సోకుతుంది.
మన దేశంలో క్యాన్సర్ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికి చాలామందికి అవగాహన లేదు. ముదిరిన దశలో వ్యాధిని గుర్తించడం వల్ల పరిస్థితి చేజారుతోంది. కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడానికి వీలుంది.