నాగచైతన్య సినిమాలో ఛాన్స్ కొట్టిన సమంత. ముందు ఎవరు అడిగారంటే..?

నాగచైతన్య సినీ లైఫ్‌లో సమంత స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధం అవుతున్నాడనిపిస్తోంది. ఇప్పటి వరకు నాగచైతన్య హీరోయిన్స్‌ను రిపీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువే. ఒక్క సమంతతో మాత్రమే నాలుగు సినిమాల్లో నటించాడు. ఏ మాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి సినిమాల్లో సమంతతో కలిసి నాగచైతన్య నటించాడు. అయితే ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో సమంత అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా బంపర్ హిట్ కావడమే కాకుండా… ఆమె లైఫ్ కూడా పూర్తిగా మారిపోయింది. అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడిపోయింది సమంత. ఆ తర్వాత వీరిద్దరి ప్రేమ వివాహం జరిగి.. విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2017 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఈ జంట… 2021 లో విడిపోయారు. ఇక ప్రస్తుతం సమంత మరియు అక్కినేని నాగచైతన్య వేరువేరు గానే ఉంటున్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి చాలా సినిమాలలోనే నటించారు.

విడాకుల తర్వాత మాత్రం నాగచైతన్య మరియు సమంత సినిమాలు కలిసి చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల దూత అనే సినిమా లో (వెబ్ సీరీస్) అక్కినేని నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వల్ కూడా వస్తుంది. అయితే ఇందులో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతుంది. ఈ మేరకు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *