హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి శ్రీలంకలో చాలా గ్రాండ్ గా అట్టహాసంగా జరిగింది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మధ్య ఆయన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ శ్రీలంకలో నిన్న రాత్రి 8:50 నిమిషాలకు వధువు మెడలో అభిరామ్ తాళి కట్టాడు.అయితే ఇక వీరంతా కూడా ఈ జంటని దీవించగా… ఓ మహిళ మాత్రం విచిత్రంగా స్పందించింది. ఆవిడ మరెవరో కాదు.. నటి శ్రీరెడ్డి.
ఈమె కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దగ్గుబాటి అభిరామ్ తనను మోసం చేసినట్లు ఆరోపణలు చేసింది. ఇక ఈ సంఘటన గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి అభిరామ్ పై, అతని కుటుంబంపై పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ” రాముడిని, సీతని విడదీసిన దేశం… సీతాదేవి శాపాలకు నిలయం, ఆంజనేయ కోపాగ్నిలో తగలబడిన దేశం. అశోక వనంలో సీతమ్మ, రాముని రాకకై తిండి మానేసి, స్నానం మానేసి దుఃఖితురాలైన ఆ రాక్షస రావణ లంక,
శ్రీలంకలో… దగ్గుబాటి అభిరామ్ పెళ్లి… వహ్వా వహ్వా.. మన దేశ ఆదర్శ జంట రాముల వారిని, సీతమ్మ వారిని విడదీసిన దేశంలోనా ని పెళ్లి? ఆహా! దైవ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఎప్పటికైనా రాక్షసులు రాక్షసులే ” అంటూ ఫేస్బుక్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది శ్రీరెడ్డి. ఈమె పోస్టుపై ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు..” నువ్వు సీతమ్మ వేంటి… ని పోస్ట్ ని చూడడం మా దరిద్రం. నిన్ను సీతతో పోల్చుకున్నావు చూడు కర్మ! కర్మ! “.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.