సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఇతర 11 మంది మంత్రులు పాల్గొన్నారు. గంట 25 నిమిషాల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత, ప్రజా సమస్యలు.. ప్రజాదర్బార్ నిర్వహణపై చర్చించింది రేవంత్ టీమ్. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రేవంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం పంపారు. కానీ వాళ్లెవరూ రాలేదు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది కూడా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు.