USAలో చదువుకుంటున్న షర్మిల తనయుడు రాజారెడ్డి నాలుగేళ్లుగా అట్లూరి ప్రియతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల వీరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు చెప్తున్నారు. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం. అయితే ఉదయం నుంచి రాజారెడ్డి పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అతుడు చేసుకోబోయో అమ్మాయితో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారని టాక్ నడుస్తోంది.
షర్మిల తెలంగాణలో రాజకీయ ఆరంగేంట్రం నుంచి ఆమెకు వైసీపీ సోషల్ మీడియా దూరంగా ఉండుకుంటూ వస్తోంది. అయితే అందులోని వ్యక్తులే రాజారెడ్డి పెళ్లి గురించి బయటి ప్రపంచానికి చెప్పడం విశేషం. ఉదయం నుంచి వారు తమ తమ గ్రూపుల్లో ఈ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ రాజారెడ్డి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి. ఈమె కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అన్నటుఉ్ట ఈమె పేరున్న కుటుంబానికి చెందినదే. ఈమె తాత అట్లూరి ప్రసాద్ రెండు తెలుగు రాషా్ట్రల్లో పేరొందిన ఛట్నీస్ రెస్టారెంట్ నిర్వాహకుడు.
రెండు కూడా ఉన్నత కుటుంబాలే కావడంతో రాజారెడ్డి, ప్రియ పెళ్లికి గ్రీన సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కాగా, రాజారెడ్డి తండ్రి బ్రాహ్మణ, తల్లి రెడ్డి, విరిద్దరిది కూడా ప్రేమ వివాహమే. షర్మిలను చేసుకున్న తర్వాత అనిల్ క్రైస్తవ మతంలోకి మారిపోయారు. ప్రస్తుతం ఆయన మతబోధకుడిగా కొనసాగుతున్నారు. ప్రియ కుటుంబానిది కమ్మ సామాజిక వర్గం. అన్నట్టు తన మేనమామ జగన ప్రస్తుతం కమ్మ సామాజికవర్గం మీద కత్తులు, కటార్లు తీస్తున్న నేపథ్యంలో.. రాజారెడ్డి కమ్మ సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండటం విశేషం.