ఇటీవల కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన దినేష్.. అప్పటినుంచి కాలేయానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో సోమవారం అర్ధరాత్రి 12.08 నిమిషాలకు దినేష్ తుదిశ్వాస విడిచారు. అయితే దేశ వ్యాప్తంగా CID సీరియల్ కు ఎంత ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసీరియల్ హిందీతో పాటు తెలుగు ప్రజల మనసులు కూడా దోచింది. ఇందులో నటించే ప్రతీ ఒక్కరు అందరికి ఫేవరేట్ అయ్యి ఉంటారు.
ముఖ్యంగా ఈ సీరియల్ లో కామెడీ ఆఫీసర్ ప్రణీత్ గా ఫేమస్ అయ్యారు దినేష్ ఫడ్నీస్. ఆయన ఈరోజు ఉదయం మరణించారు. ఐదు రోజుల క్రితం గుండె పోటుకు గురైన దినేష్.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పరిస్థితి విషమంగా ఉంది అని మొదటి నుంచీ డాక్టర్లు చెపుతూనే ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న దినేష్.. పరిస్థితి విషమించడంతో మరణించారు. తన ఎక్స్ ప్రెషన్స్ తో , కామెడీ టైమింగ్ తో నవ్వించేవారు దినేష్. భయంకలిగిన ఆఫీసర్ గా.. ఆయన యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది.

ముఖ్యంగా డాక్టర్ రాహుల్ తో ప్రణీత్ క్యారెక్టర్ లో దినేష్ సీన్స్ అద్బుతంగా పండాయి. ఇక హస్పిటల్ లో ఉన్న దినేష్ కోసం.. సీఐడీ యాక్టింగ్ టీమ్ చాలా కష్టపడ్డారు. ఆయన్ను బ్రతికించుకోవడం కోసం.. ఈ నటులలో ఒకరైన సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి దగ్గరుండి చూసుకున్నారు. కాని దినేష్ పరిస్థితి విషమించడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.