తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన బర్రెలక్క అలియాస్ శిరీష కూడా గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఫేస్ పల్లవి ప్రశాంత్, బర్రెలక్క పెళ్లి చేసుకున్నారనే రూమర్ ఇటీవల వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ సృష్టించాయి. ఇద్దరు రైతు కుటుంబానికి చెందిన వాళ్లు కాబట్టి పెళ్లి చేసుకున్నారనే ప్రచారం స్టార్ట్ చేశారు. పెళ్లి అయినట్టుగా కొన్ని మార్ఫింగ్ ఫోటోలు కూడా పెట్టారు.
ఇది ఓ యూట్యూబ్ యాంకర్ ద్వారా బర్రెలక్క దృష్టికి వెళ్లింది. దీనిపై తాజాగా బర్రెలక్క స్పందించింది. పల్లవి ప్రశాంత్‌ని పెళ్లి చేసుకున్నట్టు పుట్టించిన పుకార్లపై ఆమె స్పందిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ప్రశాంత్ అన్న రైతు కుటుంబం నుంచి వెళ్లిన నేపథ్యంలో ఆయనకు తన సపోర్ట్ ఉందని, ఆయనకు సపోర్ట్ చేయాలని తాను వీడియో కూడా చేశానని, అందులో ఆయన్ని అన్నా అని పిలిచానని, అలాంటి అన్నతో పెళ్లి ఎలా ముడిపెడతారు, అలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నించారు.
కొందరు తమ వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ పరువుని బజారున పడేస్తున్నారని మండిపడింది. ఇది తమ లైఫ్ అని, తమ జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. పల్లవి ప్రశాంత్‌ని తాను మొదట్నుంచి అన్నా అనే పిలిచానని, అన్నని ఎలా పెళ్లి చేసుకుంటారని, ఇదెక్కడి సంస్కృతి అంటూ ఆమె ప్రశ్నించింది. యూట్యూబ్ ఛానెల్స్ పై ఆమె ఫైర్ అయ్యింది. ఇలాంటివి మానుకోవాలని తెలిపింది బర్రెలక్క. తనపై ఫేక్ ప్రచారాలు మానుకోవాలని తెలిపింది.