ప్రస్తుతం విష్ణుప్రియకు ఇన్‌స్టాలో 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమెపై మనసు పారేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే విష్ణుప్రియ మనసుకు నచ్చిన వ్యక్తి మాత్రం మరొకరు ఉన్నారట. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది.
తనకు ఇప్పటికే లవ్ ఎఫైర్ ఉందని ఆమె చెప్పడం విశేషం. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. స్టార్ మాలో వస్తున్న సిక్త్స్ సెన్స్ షోలో ఆమె ఈ మధ్యే పార్టిసిపేట్ చేసింది. మరో యాంకర్ రవితో కలిసి ఈ షోకు ఆమె వచ్చింది.
ఈ సందర్బంగా హోస్ట్ ఓంకార్ ఆమెను లవ్ ఎఫైర్ గురించి అడిగాడు. దీనికి ఆమె ఎలాంటి తడబాటు లేకుండా సమాధానం చెప్పింది. సాధారణంగా తమ ఎఫైర్లను సీక్రెట్ గా ఉంచడానికే చాలా మంది ఇష్టపడతారు.