తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ వ్యాఖ్యానించారు. పైగా 100 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ విమర్శలు చేశారు. దేశం దివాళా తీయడానికి మోదీనే కారణమన్నారు.
మూడోసారి మోదీని ప్రధానిని చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందంటూ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందంటూ సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అప్పులు, ఫిరాయింపుల్లో ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ పడ్డారు అంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.
మోదీ రైతులను పట్టించుకోకపోవడం మాత్రమే కాకుండా.. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారంటూ చెప్పుకొచ్చారు. దేశానికి రాహుల్ గాంధీ లాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉందంటూ వ్యాఖ్యానించారు.