తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తున్న కృతిశెట్టి.. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కృతితో ఇంటర్వ్యూలు తీసుకునేందుకు పలు ఛానెల్స్, మ్యాగజైన్లు పోటీపడుతున్నాయి.
ఇందుకు తమిళ ప్రాంక్ యూట్యూబర్లు ఆశిక్, సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ జరుగుతుండగా వీరిద్దరూ బిగ్గరగా అరుస్తూ కృతిశెట్టిని నేను ప్రశ్నలు అడుగుతానంటే, నేను అడుగుతానని ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. హీరోయిన్ ఎదుటే కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.
దీంతో అదంతా ప్రాంక్ అని తెలియక అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక కృతి భయపడింది. తర్వాత వారు ప్రాంక్ అని చెప్పినా మొదట నవ్వినా ఆపై దుఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది కృతి శెట్టి. దీంతో ఆ ప్రాంక్ కాస్త తప్పుగా వెళ్ళింది. కృతి ఇలా లైవ్ లో ఏడ్చేసరికి కృతి ఫ్యాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్రాంక్ చేసిన వారిని విమర్శిస్తున్నారు. కృతి కన్నీళ్ళు పెట్టడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.