బైక్ ట్యాక్సీల్లో ఒకటైన ర్యాపిడోను ప్యాసింజర్లు ఎక్కువగా బుక్ చేసుకుంటుంటారు ఎందుకంటే.. మిగతా వాటికంటే ఇందులో ధర కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా బుక్ చేసుకుంటే అలా వాలిపోతున్నారు బైక్ రైడర్లు. హైదరాబాద్ లో ర్యాపిడో బైక్ రైడర్ కు ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది. ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకున్నాడు.
కస్టమర్ ను బైక్ పై ఎక్కించుకుని గమ్యస్థానానికి బయలుదేరారు. అలా వెళ్తుండగా మార్గమధ్యంలో బైక్ లో పెట్రోల్ అయిపోయింది. దీంతో బైక్ ఆగిపోయింది. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల పెట్రోల్ బంకులు లేకపోవడంతో దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంకుకు బైకును తోసుకుంటూ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు బైక్ రైడర్.
కాగా బంకు వరకు నడుచుకుంటూ రావాలని కస్టమర్ ను బైక్ రైడర్ కోరాడు. నడుచుకుంటూ వచ్చేందుకు కస్టమర్ తిరస్కరించాడు. దీంతో చేసేదేం లేక అతడిని బైక్ పై కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ తీసుకు వెళ్లాడు. ఈ తతంగాన్నంతా వారి వెనకాలే వస్తున్న కారులోని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్.. అలాగే తోసుకుంటూ వెళ్లిన రాపిడో రైడర్
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2024
హైదరాబాద్ – ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకోని వెళ్తుండగా మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది.
దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడుచుకుంటూ రావాలని కస్టమర్‌ను రైడర్ అడగ్గా అతను… pic.twitter.com/BWdfFkNkxu