కృష్ణంరాజు చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.తాజాగా ఆయనకు సంబంధించిన మర వార్త ఇప్పుడు సోషల్ మీడియాాలో చక్కర్లు కొడుతుంది. కొందరు కృష్ణంరాజు చనిపోవడానికి ముందు రోజు ఒక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే కృష్ణంరాజు మరణానంతరం చాలా మంది చాలా ఆర్టికల్స్, గతంలో ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూస్‌ను మీడియా ప్రసారం చేసింది. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సైతం కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్ానరు.
కానీ కొంతమంది కృష్ణంరాజు మరణాన్ని కూడా.. తమ ఛానల్‌కి హిట్స్ రావటం కోసమని ఏవేవో ఫేక్ వార్తలు పెట్టి వీడియోని పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలో కృష్ణంరాజు పూజ చేస్తూ కనిపించారు. ఆ వీడియో ఆయన మరణించడానికి ఒక రోజు ముందుదని.. చనిపోవడానికి ముందు రోజు ఆయన పూజ చేశారని.. ఆ వీడియో చూస్తే కన్నీళ్లాగవంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు చనిపోయే ముందురోజు కృష్ణంరాజు హాస్పిటల్‌లో ఉన్నారు. పూజ చేయడానికి అవకాశమే లేదు. మనకి ఏదైనా వీడియో దొరికితే.. ముందూ వెనుక ఆలోచించకుండా హెడ్డింగ్ పెట్టి వార్త రాసేస్తా ఎలా? పైగా కొన్ని సెన్సిటివ్ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
అంత పెద్ద నటుడి మరణాన్ని కూడా ఏవో హిట్స్ కోసం వాడేసుకోవాలా? అందులో నిజానిజాలు చూడొద్దా? ఆ వీడియోలో పురోహితుడు చాలా స్పష్టంగా వికారి నామ సంవత్సరే అని కృష్ణంరాజు ప్రవర చదివినపుడు చెపుతాడు. అంటే ఆ వీడియో గత సంవత్సరానికి చెందింది అని అర్థం. అది కూడా గుర్తించలేదు. కథనాలను వండి వార్చి వడ్డించేశారు. దీనిపై నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు. ఆయన కొద్దిరోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నారన్న వార్తలు అన్ని మీడియా ఛానల్స్‌లో ప్రసారమయ్యాక కూడా ఇలాంటి వార్తలు రాయడంపై మండిపడుతున్నారు.