శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ఈకేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలు చేపట్టారు.
అటుపై సాయంత్రం అరెస్ట్ నోటీ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయితే కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆమె ఇంటికి చేరుకున్నారు.
అదే క్రమంలో ఈనెల 19వ తేది వరకు ఎలాంటి సోదాలు, అరెస్ట్ లు చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు చెబితే ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.
ఈపరిణామాల నేపధ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కవిత ఇంటి దగ్గర నిరసనకు దిగారు.