కన్నె శిరీష అలియాస్ బర్రెలక్క ..నిరుద్యోగ సమస్యతో సతమతం అవుతూ.. ఉపాధి కోసం బర్రెలను కాయాల్సి వస్తోందంటూ సోషల్ మీడియాలో చేసిన ఒక్క పోస్టుతో శిరీష ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ పెద్దకొత్తపల్లి మండలం , మరికల్ గ్రామానికి చెందిన యువతి. ఇక ఇప్పుడు అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే కుర్రోడిని పెళ్లాడింది ఈ అమ్మడు. బర్రెలక్క తల్లి రోజు కూలీ, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల వలన .. శిరీష తల్లీకి సాయంగా ఉంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో ఇన్ఫ్లుఎన్సర్ గా మారడం. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయడం. ఇక ఆ తర్వాత బాగా పాపులర్ అవ్వడం అందరికి తెలిసిన విషయమే. అయితే బర్రెలక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం ఆమె తండ్రి .. కుటుంబానికి దూరంగా ఉన్నాడని సమాచారం. బర్రెలక్కకు ఆమె తండ్రికి మధ్య మనస్పర్థలు ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ క్రమంలో ఆమెకు కన్యాదానం చేసింది ఎవరా అని అందరు ఆసక్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పూర్తి వివరాలైతే బయటకు రాలేదు కానీ.
కన్యాదానానికి సంబంధించిన ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎట్టకేలకు బర్రెలక్క వివాహం.. కుటుంబ సభ్యులు, బందు మిత్రులు, సన్నిహితుల మధ్యన .. అంగరంగ వైభవంగా ముగిసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి వీడియో కూడా నెట్టింట షికార్లు చేస్తుంది. దీనితో ఆమె అభిమానులు నవదంపతులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఆమె భర్త వెంకటేష్ కూడా బర్రెలక్క ఏ నిర్ణయం తీసుకున్నా.. తన వెంటే ఉంటూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారట. కట్నం కూడా ఏం తీసుకోకుండా బర్రెలక్కను పెళ్లి చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బర్రెలక్క వివాహానికి సంబంధించిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.