బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బనగానపల్లె నివాసి శిష్యుడు అన్నాజయ్య తాటాకుల మీద రాశాడనడానికి కాలజ్ఞానంలో సూచనలున్నాయి. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు చాలా విషయాలు జరిగాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చాలా విషయాలు రాశారు. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ఈయన ముందుగానే రచించి తాలపత్ర గ్రంథాల్లో రచించి పొందుపరిచారు. ఆయన ఇప్పుడు కాదు.. కొన్ని వేల సంవత్సరాల కిందనే తాళపత్ర గ్రంథాల్లో రాశారు. అవన్నీ జరిగాయి.
ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మంగారు చెప్పినవి ఎన్నో నిజం అవడం వల్ల.. కాలజ్ఞానాన్ని అందరూ నమ్మాల్సి వస్తోంది. ఆయన కాలజ్ఞానం ప్రకారం నీటితో దీపాలు వెలిగిస్తారు అన్నారు. అంటే నీటితో కరెంట్ ను ఉత్పత్తి చేయడం అన్నమాట. ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయి అని చెప్పారు. ఇప్పుడు అన్నీ యంత్ర వాహనాలే వచ్చాయి. కాశిపట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది అని చెప్పారు. ఒక వితంతువు 16 ఏళ్ల పాటు ఈ దేశాన్ని ఏలుతుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు.
తెర మీది బొమ్మలు గద్దెనెక్కుతాయి అన్నారు. రాచరికాలు నశిస్తాయి.. రాజుల పాలన నశిస్తుంది అన్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, హైదరాబాద్ లో హిందూ ముస్లింలు ఒకరిని మరొకరు నరుక్కొని చనిపోతారని, మతకలహాలు చెలరేగుతాయని, దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనం అవుతాయని, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని చెప్పారు.