ఈ వ్యాయామాలతో జిమ్‌లో రష్మిక మందన్న చెమటలు పట్టించింది.

సినిమాల్లో హీరోయిన్‌గా రాణించాలంటే ఫిజిక్ కూడా ఇంపార్టెంట్. అందుకే హీరోయిన్స్ తమ శరీరాన్ని ఎపుడు కష్టపెడుతూ జిమ్‌లో గంటలకొద్దీ గడుపుతూ ఉంటారు. తాజాగా రష్మిక మందన్న జిమ్‌లో వర్కౌట్ చేస్తూ బయటకు వచ్చిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప పార్ట్ 2, తమిళంలో కార్తీ సరసన ఓ ప్రాజెక్ట్ ఉంది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో 2-3 చిత్రాలు ఉన్నాయి. షూటింగ్ దశలో ఉన్న హిందీ చిత్రాలు త్వరలోనే పూర్తి కానున్నాయి. అయితే రష్మికకు ఇన్ని ఆఫర్లు రావడానికి కారణం కేవలం నటన మాత్రమే కాదు.. అందం, ఫిట్‌నెస్‌ కూడా. ఆ ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందు కన్నడ భామ ప్రతిరోజు జిమ్‌లో కష్టపడతారు. అందుకు సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ మధ్య జిమ్ టైట్‌ ఫిట్‌ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసిన రష్మిక మందన.. తాజాగా మరోసారి వర్కౌట్లు చేస్తూ వావ్ అనిపించారు.

రష్మిక ప్యాంట్ లేకుండా కేవలం పొట్టి షార్ట్ ధరించి.. వర్కవుట్స్‏తో హడావిడి చేశారు. ఎంతో యాక్టివ్‏గా తన ట్రైనర్ చెప్పే వర్కవుట్స్ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా కాళ్లు, చేతులతో ఎక్కువగా జిమ్ వర్కవుట్స్ చేశారు. కష్టమైన ఫిట్లను సైతం రష్మిక ఎంతో తెలికగా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూస్తే ఎవరికైనా చెమటలు పట్టేలా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *