ఊర్వశి సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో హిందీలో అరంగేట్రం చేసింది, అక్కడ ఆమె సన్నీ డియోల్ సరసన కథానాయికగా నటించింది. చిత్రం విడుదలైన తర్వాత, ఊర్వశి యో యో హనీ సింగ్ యొక్క అంతర్జాతీయ వీడియో ఆల్బమ్ లవ్ డోస్లో కనిపించింది, ఇది 2014 అక్టోబరులో విడుదలైంది. అయితే కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరోసారి వార్తలలో నిలిచింది. తన బర్త్ డేకు బంగారపు కేక్ కట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఫిబ్రవరి 25న ఊర్వశి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె బంగారపు కేక్ కట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటుంది ఊర్వశి. ఇక ఈసారి కూడా తన పుట్టినరోజు వేడుకలను స్నేహితుల సమక్షంలో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలలోనే 24 క్యారెట్లతో బంగారపు పూత పూసిన కేక్ కట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఊర్వశి తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్.
ఊర్వశి రౌటేలా 25 ఫిబ్రవరి 1994న ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో జన్మించింది. అతి చిన్న వయసులో మోడలింగ్ స్టార్ట్ చేసిన ఆమె.. సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ చిత్రం ‘సింగ్ సాహెబ్ ది గ్రేట్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా.. ఆమె మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో రెండు సార్లు విజేతగా నిలిచింది.