డ్రగ్ కేసులో షణ్ముఖ్, అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ మౌనిక అనే యువతిని మోసం చేసి.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్. అయితే తాజాగా షణ్ముఖ్ ఏకంగా డ్రగ్ కేసులో బుక్ అయ్యాడు. నిషేదిత గంజాయి తాగుతూ షణ్ముఖ్ అడ్డంగా బుక్ అయ్యాడు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ చేతిలో మోసపోయిన యువతి కంప్లైంట్ కారణంగా… షణ్ముఖ్ గంజాయి తాగుతాడనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మౌనిక అనే యువతితో సంపత్ కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తీరా ఆమెను కాకుండా మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కాగా అసలు మౌనికను అన్న సంపత్ కి పరిచయం చేసింది షణ్ముఖ్ అట. తన షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లలో అవకాశం ఇస్తానని కూడా మౌనికకు షణ్ముఖ్ ప్రామిస్ చేశాడట.
మౌనికతో లైంగిక సంబంధం పెట్టుకున్న సంపత్ ఒకసారి ఆమెకు అబార్షన్ చేయించాడట. అన్ని విధాలా మోసపోయిన మౌనిక… సంపత్ మీద కేసు పెట్టింది. పోలీసులను తీసుకుని షణ్ముఖ్ ఇంటికి వెళ్ళింది. అక్కడ షణ్ముఖ్, సంపత్ గంజాయి సేవిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. మత్తులో ఉన్న షణ్ముఖ్ ని మౌనిక కెమెరాతో షూట్ చేస్తుండగా… అతడు దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. అన్నదమ్ములు ఇద్దరూ ఓ యువతిని మోసం చేయడం సంచలనంగా మారింది.