మైదా పిండితో చేసే వంటకాల సంఖ్య తక్కువేమీ కాదు. అనేక రకాల స్వీట్లు, కేకులు, బ్రెడ్డు, బొబ్బట్లు… ఇలా ఎన్నో ఈ పిండితో తయారు అవుతాయి. మైదాపిండి, పంచదార కలిసి తయారయ్యే వంటకాల సంఖ్య చాలా ఎక్కువ. ఈ రెండూ కలిస్తే ఆరోగ్యానికి చాలా ముప్పు. అయితే మైదా పిండిని గోధుమలతో తయారు చేస్తారు..అదేలా అంటే..ముందుగా గోధుమలను బాగా పాలిష్ చేస్తారు. తరువాత ఇలా పాలిష్ చేసిన గోధుమలను పిండి చేసి, అజో బై కార్పోనమైడ్, బెంజోయిల్ పెరాక్సైడ్, క్లోరిన్ గ్యాస్ వంటి రసాయనాలతో క్లీన్ చేస్తారు.
అందువల్లే మైదా పిండి తెల్లగా మెత్తగా ఉంటుంది. అసలు చెప్పాలంటే..బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ ల వాడకాన్ని చైనా, ఐరోపా దేశాలలోను పూర్తిగా నిషేధించారు. అంతేకాదు దీని తయారీలో అల్లోక్సన్ అనే రసాయనాన్ని కూడా వాడతారు. అయితే ఈ మైదా పిండిని చాలా దేశాల్లో నిషేధాన్ని విధించారు. మైదాను ఎక్కడ నిషేధించిన సరే…దక్షిణ భారత్ లో మాత్రం మైదాను ఎక్కువగా వాడేస్తుంటారు. ఇక కాస్త తడి తగిలితే చాలు జిగురుగా మారుతుంది. చేతులకు అతుక్కుపోతుంది.

దీనిని చాలారకాల వంట పదార్థాలలో, టిఫిన్స్ లో వాడతారు. కాకపోతే మైదా పిండి ఎక్కువ మోతాదులో వాడటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. మైదా పిండిని తరుచుగా వంటల్లో వాడేవారు అధికంగా మధుమేహ సమస్యలకు గురవుతారు. అంతేకాదు కిడ్నీసమస్యలు, గుండె సంబంధిత వ్యాదులు కూడా మైదాను వాడడం వల్ల వస్తాయి. అందుకోసమే మైదాను మనం తినే ఆహారంలో తగ్గిస్తే మంచిదంటున్నారు నిపుణులు.