శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఈ సమయంలో గంగానది ఇతర నదులు చెరువులు, బావుల్లో ప్రవహించి ఆ నీటిని అమృతంగా మారుస్తుంది. అంటారు అందుకే ఈ నెలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో చేసేటువంటి నది స్నానానికి అలాగే కార్తీక మాసంలో రెండుసార్లు స్నానం చేసి తప్పకుండా దీపారాధన చేయాలి.
ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది. అలాగే సాయంత్రం పూట దీపం వెలిగించి పూజ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవద్దు. అలాగే కార్తీక పురాణాన్ని చదవటం ఎవరైనా చదువుతుంటే వినటం లాంటివి చేయాలి. అలాగే ప్రసాదాన్ని పంచిపెట్టడం దానధర్మాలు చేయడం పండ్లను సమర్పించడం బ్రాహ్మణులకు దానాలు చేయటం లాంటివి చేస్తారు. ఇంట్లో అయితే మనస్పర్ధలు ఎప్పుడూ వ్యక్తుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో.. ఆ ఇంట్లో దీపారాధన ప్రతినిత్యం జరిగితే కచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు సరైన సమయంలో దీపాన్ని వెలిగించాలి. అప్పుడే ఆ దీపానికి అర్థము పరమార్థము ఏర్పడుతుంది.
దీపారాధనని సూర్యోదయం కాకముందు నుంచి ఉదయం 10 గంటల వరకు పూజ చేసి దీపాలు వెలిగించాలి. ఈ సమయంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మనసులు ఇష్టదైవాన్ని వేడుకోవడం ద్వారా శుభం కలుగుతుంది. ఇక 10 గంటల తర్వాత నుంచి 5 గంటల వరకు కూడా దీపారాధనకి చెప్పదగ్గ లేదా సూచించదగ్గ సమయం కాదు. సాయంత్రం కూడా ఇంటిని శుభ్రపరచుకొని ఐదు గంటల సమయంలో కేవలం 6 గంటలకు దీపారాధన చేసేయాలి. ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక కార్తిక మాసంలో వెలిగించే దీపాలు కూడా ఈ సమయంలో వెలిగించడం ద్వారా పరమశివుని అనుగ్రహం మనపై కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉంటారు.