కేసీఆర్ ఇష్టపడి కట్టించుకున్న ప్రగతి భవన్. ఎన్ని కోట్లతో కట్టారో తెలుసా..!

ప్రగతి భవన్..కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఎక్కువశాతం అధికారిక సమీక్షలను ఇక్కడే నిర్వహించే వారాయన. మంత్రులు, అధికారుల రాకపోకలతో కళకళలాడుతుండేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు.. జ్యోతిబా ఫూలే ప్రజాభవన్.. ప్రగతి భవన్‌ గా ఉండేది.. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ దగ్గర కంచెను తొలగించడంతోపాటు..

పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ పేరును జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ గా నామకరణం చేశారు. అక్కడే ప్రజావాణి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో జ్యోతిబాపూలే ప్రజాభవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు కేటాయించారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక నివాసానికి, క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు..

రేవంత్ రెడ్డి తన నివాసం, క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఇటీవల జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డిఐ) ప్రాంగణాన్ని పరిశీలించారు. సిఎం క్యాంపు కార్యాలయంగా మార్చడానికి అవసరమైన మార్పులపై చర్చించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *