చిరంజీవి మాత్రం తాను మౌనవ్రతంలో ఉన్నానంటూ మీడియా ప్రతినిధికి చెప్పారు. పోలింగ్ బూత్ వద్ద చిరు హాస్యాన్ని పండించారు. పోలింగ్ బూత్ లోకి వెళ్తున్న తనను పదే పదే మాట్లాడించాలని చూసిన న్యూస్ టీవీ రిపోర్టర్ తో చిరంజీవి ఈ మాటలన్నారు. ప్రస్తుతం చిరు మౌనవ్రతం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ క్లబ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు చిరంజీవి. మెగాస్టార్ వెంట ఆయన సతీమణి సురేఖ, కూతురు శ్రీజ ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూలులో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు నటుడు ఎన్టీఆర్. అందరితో పాటు క్యూలో నిలబడి మరీ ఓటు వేసిన ఎన్టీఆర్..ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అలాగే జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ హీరో అల్లు అర్జున్.
ఉదయం 7గంటలకే క్యూలో నిలబడి పోలింగ్ కేంద్రానికి రాగా… ఈవీఎం మొరాయించింది. కాసేపు వెయిట్ చేసి…ఆ తర్వాత ఓటు వేసి వెళ్లారు అల్లు అర్జున్. జూబ్లీహిల్స్ క్లబ్‌లో సుమంత్ ఓటు వేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లోతన ఓటు హక్కును వినియోగించారు. ఆయన వెంట కుమారుడు, ప్రముఖ సింగర్ కాల భైరవ కూడా ఉండి ఓటును వేశారు.