బాల రాముడి దివ్య రూపం చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. దివ్య ఆభరణాలు, అందమైన బట్టలతో అలంకరించిన రామ్ లల్లా విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే బాలరాముడు సుందర దివ్యమూర్తి అందరిని విశేషంగా ఆకట్టుకుంది. అంతగా బాలరాముడి దివ్య రూపం ప్రతి ఒక్క హిందువుని మైమరిపింపజేసింది. ఆయన వేసుకున్న నగలు కూడా చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి. అని అందరూ చర్చించుకుంటున్న ఈ సమయంలో అయోధ్యలో కొలువైన బాల రాముడు విగ్రహానికి 7వారాల నగలు ధరింపజేశారు. వాటి గురించిన వివరాలు చూద్దాం..
ఏడు గ్రహాలను అధిపతులుగా నిర్ణయించారు..ఇష్టమైన రత్నాలను కూడా నిర్ణయించారు. నవగ్రహాల అనుగ్రహం కావాలంటే వారికి ఇష్టమైన రత్నాలను ధరించాలని చెబుతారు. పూర్తిగా ఆడవారు ఇలాగే నగలను ధరించేవారు కూడా.. ఇప్పుడు బాల రాముడికి కూడా ఆఫ్రాకారమే నగలను చేయించారు. ఆదివారం సూర్యుడు దినానికి గుర్తు అయిన ఈ రోజున స్వామివారికి కెంపులతో కూడిన నగలను వేస్తారు. తల నుంచి కాళ్ల వరకు మొత్తం కెంపులతో చేసిన హారాలే ఉంటాయి. సోమవారం రోజు ఇది చంద్ర దినం కాబట్టి చంద్రుడికి ముత్యాలంటే ఇష్టం. అందుకే ఈ రోజున బాల రామునికి ముత్యాల హారాలు ధరింప చేస్తారు.
మంగళవారం కుజుడు ఈరోజుకు అధిపతి ఈయన అనుగ్రహం కోసం పగడాల గొలుసులు ఉంగరాలు ఉంటాయి. బుధవారం రోజుకు అధిపతి బుధుడు ఈరోజు పచ్చల పథకం పచ్చలు అమర్చిన గాజులు వేస్తారు. గురువారానికి అధిపతి దేవగురువు. బృహస్పతి ఈరోజున పుష్యరాగం ఉన్న కమ్మలు ఉంగరాలు బాల రాముడు ధరిస్తాడు. శుక్రవారం రోజు శుక్రుని వారమైన ఈరోజు రాములల్ల వజ్రాల హారాలు, వర్షపు ముక్కుపుడక , కమ్మలు వేసుకుంటారు. శనివారానికి అధిపతి శని భగవానుడు. ఆయన అతీతంగా నీలిమణి హారాలు ఆభరణాలను ధరిస్తాడు.
ఆభరణాలను శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థకు చెందిన హర్ష జ్యువెలర్స్ తయారు చేస్తుందని శ్రీరామ జన్మభూమి తెలిపింది. ఆధ్యాత్మి రామాయణం, వాల్మీకి రామాయణం, స్తోత్రం వంటి గ్రంథాలలో శ్రీరాముడి వైభవం ధరించిన దివ్య ఆభరణాల గురించి విస్తృతమైన అధ్యయనం చేసిన తర్వాత వీటిని తయారు చేయించామని చెప్తున్నారు.