రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్యాదపూర్వకంగా తొలిసారి రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిసిన చిరంజీవి ముఖ్యమంత్రిగా ఎన్నికయినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అయితే తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు. వీరిద్దరూ కాసేపు పలు విషయాలపై మాట్లాదుకున్నారు.
రేవంత్ పేరును సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే… అందరికంటే ముందుగా ఆయనను చిరంజీవి అభినందించారు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఈ రోజు ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.@KChiruTweets pic.twitter.com/RJD2R6m3Wl
— Revanth Reddy (@revanth_anumula) December 25, 2023