రామ్ చరణ్ అంటే నమ్రత కి ఎంత ప్రేమో చుడండి. వదిన అంటూ..?

ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోదరుడి కొడుకు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, అద్వైత రెడ్డి ల వివాహం ఇటీవ‌ల ఘనంగా జరిగిన విష‌యం తెలిసిందే. జైపూర్ ప్యాలెస్ లో వైభవంగా జరిగిన ఈ పెళ్లికి బంధువులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

అయితే శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. మహేష్ బాబు-రామ్ చరణ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ తో కూడా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటారు. వీరి భార్యలు మరింత క్లోజ్. నమ్రత శిరోద్కర్-ఉపాసన వెరీ క్లోజ్. పార్టీలు, పండగలు కలిసి జరుపుకుంటారు.

ఈ పార్టీలో రామ్ చరణ్ చేయి పట్టుకుని నమ్రత పోజ్ ఇవ్వడం ఆకర్షించింది. ఇక షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు మాత్రం హాజరు కాలేదని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *