ఎంతటి స్టార్ అయిన సరే.. భార్య దగ్గర భర్తే కదా.. అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే.. గతంలోను చరణ్ ఓసారి ఉపాసన బ్యాగులు మోస్తు కనిపించాడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ సమయంలో ఉపాసనతో కలిసి అమెరికా టూర్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు చరణ్.
అయితే టాలీవుడ్‌లో ది బెస్ట్ కపుల్‌గా ఉన్న చరణ్, ఉపాసన.. లేటెస్ట్‌గా ముఖేష్ అంబానీ కొడుకు అనిత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం స్పెషల్ ఫ్లైట్‌లో గుజరాత్ వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే.. ఇప్పుడో రేర్ వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో.. చరణ్ తన భార్య కాళ్లు నొక్కుతు కనిపించాడు. ఆ సమయంలో ఉపాసన నిద్ర పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
Beautiful love ❤️❤️ @AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/YwD3z1ISCc
— Team Chiru Vijayawada (@SuryaKonidela) March 2, 2024