నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
కొన్ని సార్లు పొట్టి బట్టల్లో బోల్డ్ గా కనిపిస్తూ తల్లి కూతుళ్లు రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. సురేఖ వాణి కూడా కూతురికి ఏమాత్రం తగ్గకుండా ఈ ఏజ్ లో కూడా హాట్ గా కనిపిస్తోంది. మోకాళ్ళపైకి ఉన్న బట్టల్లో దర్శనం ఇస్తోంది. తన తల్లికి ఎప్పటికైనా సెకండ్ మ్యారేజ్ చేస్తానని సుప్రీతా ఆల్రెడీ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.
కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి కారణం ఆమె కొన్ని రోజుల క్రితం షేర్ చేసిన వీడియో డిలీట్ చేయడమే.