బ్రేకింగ్ న్యూస్, అదుపుతప్పి భూమి మీదకు దూసుకొస్తున్న చంద్రయాన్ -3.

చంద్రయాన్-3ని ఈ ఏడాది జులై 14న విజయవంతంగా ప్రయోగించారు. 124 రోజుల తర్వాత రాకెట్ భాగం భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెర్బిస్ కో ఆర్డినేషన్ కమిటీ (ఐఏడీసీ) ప్రకారం ఎల్వవీఎం3 ఎం4 క్రయోజనిక్ ఎగువ దశ 25 ఏళ్ల జీవితకాలానికి అనుగుణంగా ఉన్నట్టు ఇస్రో తెలిపింది. అయితే చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన లాంచ్ వెహికల్ ఎల్‌వీఎం3 ఎం4లోని క్రయోజనిక్ పైభాగం నియంత్రణ కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశించింది.

ఉత్తర పసిఫిక్ మహాసముద్రంపై దీని ప్రభావ పాయింట్ ఉన్నట్టు అంచనా వేసిన ఇస్రో.. దీని చివరి గ్రౌండ్ ట్రాక్ మాత్రం భారత్ మీదుగా వెళ్లలేడని తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాలకు ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించినట్టు పేర్కొంది. చంద్రయాన్-3ని, 2023 జులై 14న విజయవంతంగా ప్రయోగించారు. 124 రోజుల తర్వాత రాకెట్ భాగం భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెర్బిస్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రకారం ఎల్వవీఎం3 ఎం4 క్రయోజనిక్ ఎగువ దశ 25 ఏళ్ల జీవితకాలానికి అనుగుణంగా ఉన్నట్టు ఇస్రో తెలిపింది.

ఐక్యరాజ్యసమితి, ఐఏడీసీ మార్గదర్శకాలను అనుసరించి చంద్రయాన్-3 ప్రొపల్షన్, ల్యాండింగ్ మాడ్యూళ్లు రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత దాని అవశేషాలు, ఇంధన వనరులు ప్రమాదవశాత్తు పేలుడుకు గురికాకుండా ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఎగువ దశను నిష్క్రియాత్మకం చేశారు. అంతర్జాతీయంగా ఆమోదించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఈ రాకెట్ బాడీని నిష్క్రియం చేయడం.. మిషన్ పూర్తయిన తర్వాత బాహ్య అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కాపాడటానికి భారత్ నిబద్ధతను ఇది మరోసారి పునరుద్ఘాటిస్తుంది అని ఇస్రో స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *