ఈసారి హీరో శివాజీ, రైతు బిడ్డ ప్రశాంత్ నామినేషన్లలో లేకపోయేసరికి వారి ఓట్లు మరొకరికి చాలా ప్లస్ అయ్యాయి. దీంతో అమర్ దీప్ వెనుకంజలో పడిపోయాడు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న 10 మంది కంటెస్టెంట్స్‌లో ఎక్కవగా ఓటింగ్ వచ్చేది శివాజీ, పల్లవి ప్రశాంత్‌లకే. అయితే ఈ ఇద్దరూ ఈ వారం నామినేషన్స్‌లో లేని కారణంగా ఓటింగ్ అంతా ప్రిన్స్ యావర్‌పై సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
ఈవారం అందరికంటే ఎక్కువ ఓటింగ్ యావర్‌కే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే అందరికంటే తక్కువ ఓట్లతో రతిక డేంజర్ జోన్‌లో ఉండే అవకాశం ఉందని సమాచారం. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే రతికకు ఓటు వేసే ఛాన్సే లేదు. కానీ శివాజీ ఫ్యాన్స్ మాత్రం రతికకు ఓటు వేసే అవకాశం ఉంది అనుకునేలోపే రతిక.. శివాజీకి వ్యతిరేకంగా మారడం తనకు పెద్ద మైనస్ కాబోతోంది. ఈవారం మొదట్లో రతిక.. నామినేషన్స్‌లో ఎలా ఉండాలి అనే సూచనలను శివాజీని అడిగి తెలుసుకుంది. శివాజీ కూడా తనకు సలహాలు ఇచ్చాడు.

శివాజీ ఏం చెప్పాడో రతిక అదే చేసింది. శోభా శెట్టి, ప్రియాంకలను నామినేట్ చేస్తూ తను చెప్పాలనుకున్న పాయింట్స్‌ను కరెక్ట్‌గా చెప్పింది. ఏం మాట్లాడాలనుకుందో అదే మాట్లాడింది. దీంతో రతిక మళ్లీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టుగా ఉందని ప్రేక్షకులు అనుకున్నారు. నామినేషన్స్‌లో మంచిగా ఆడిందని పేరు తెచ్చుకున్న రతిక.. వెంటనే మళ్లీ పాత తప్పులను రిపీట్ చేసి ప్రేక్షకుల దృష్టిలో నెగిటివ్ అయ్యింది.