తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ మహాలక్ష్మి పథకాన్ని , అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల చేయూత పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చి విలక్షణ తీర్పు.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అన్నారు. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని తెలిపారు.
బిఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచారని చెప్పారు. బిఆర్‌ఎస్ పార్టీ కుటుంబపాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారన్నారు.