అన్నం మీద ఒట్టేసి..! అన్నీ అబద్ధాలు చెప్పిన శివాజీ, చివరిల్లో ట్విస్ట్ ఏంటంటే..?

తేల్చుకోవడం కాదు సార్.. తెలుసుకోవాలనుకుంటున్నా. టాస్కులో సాధించిన బాల్స్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. మేం వాటిని దొంగలిస్తాం అని అంటే.. పెద్దాయన శివాజీ అలా చేయడం తప్పు, దుర్మార్గం, ఫౌల్ గేమ్, ఎథిక్స్ అంటూ మాట్లాడారు అని తేజ జరిగింది చెప్పాడు. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం యావర్ చివరి ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. అతను ఆ టాస్కులో శివాజీ, ప్రియాంకతో తలపడ్డాడు. ఆ ఛాలెంజ్ కి శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్ సంచాలకులుగా వ్యవహరించారు. తమ నిర్ణయం చెప్పే సమయంలో రూల్స్ కి తగ్గట్లు చెప్పండి అనేసరికి వాళ్లు కన్ఫ్యూజ్ అయ్యారు.

ఇద్దరూ కలిసి చాలాసేపు చర్చించుకున్నారు, వాదించుకున్నారు, మల్లగుల్లాలు పడ్డారు. అయితే విన్నర్ అనౌన్స్ చేసే సమయంలో శోభా- శివాజీకి గొడవ జరిగడం అందరూ చూశారు. తాను ఎందుకు అరవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. విన్నర్ యావర్ అని అనౌన్స్ చేసిన తర్వాత శోభాకి థాంక్స్ అని చెప్పాడు. అప్పుడు శోభా కూడా తగులుకుంది. ఎందుకు అన్న థాంక్స్ అంటూ ప్రశ్నించింది. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావ్ అందుకే అంటూ చెప్పాడు. ఒకటి కాదు.. రెడు కాదు.. మూడుసార్లు నువ్వు సంచాలక్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. నేను ఈ గేమ్ గురించి చెప్పలేదు.

నేను ఏమైనా పిచ్చోడ్నా ఈ గేమ్ లో నేను ఎందుకు గెలుస్తాను? నాకు తెలీదా? నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని నిన్ను అలర్ట్ చేశాను అంటూ ఫ్లేట్ తిప్పేశాడు. అయితే తాను గెలవను అనుకున్నప్పుడు ఇంత గొడవ ఎందుకు చేసినట్లు? అక్కడితోనే అంతా షాకైతే.. ఆ తర్వాత నేను గెలవనని తెలిసే బాల్ పడేశాను అంటూ ఇంకోసారి ప్లేట్ ఫిరాయిండు. నిజానికి శివాజీ ఎక్కడా కూడా ఆట ఓడిపోవాలి అనే ఉద్దేశంతో ఆడలేదు. ప్రతినిమిషం గెలవాలి అనే కసితోనే ఆడాడు. డిస్టర్బ్ చేయద్దు అంటూ ప్రశాంత్ తో గొడవ కూడా పెట్టుకున్నాడు.

శోభాని అరవద్దు అంటూ కేకలు కూడా వేశాడు. చివర్లో తాను ఓడిపోయాననే కోపంతో బాల్ ని నేలకు వేసి కొటాడు. చివర్లో మాత్రం తాను అసలు గెలవడం కోసమే ఆడలేదు అంటూ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ దగ్గర డిస్కషన్ స్టార్ట్ చేశాడు. నన్ను పక్కన పెట్టారు అని నిన్ను అరిచాను అనుకున్నావా? అని అడిగాడు. అందుకు ప్రశాంత్ అలా ఏం లేదన్నా అన్నాడు. మళ్లీ నాకు ఆ మాట రాకూడదు అంటూ చెప్పుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *