ఎలిమినేషన్స్ ద్వారా రోజు రోజుకి బిగ్‌బాస్ హౌస్ లో పోటీ పెరుగుతోంది. అంతేకాదు మిగిలిన కంటెస్టెంట్స్ మధ్య కూడా టగ్ ఆఫ్ వార్ అన్నట్లు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బయటికి ఎలిమినేషన్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్, అలాగే మిగిలిన హౌస్ మేట్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో రాత్రి అవ్వగానే కెమెరాలు ఆఫ్ అవుతాయని, ఆ తర్వాత కంటెస్టెంట్స్ గేమ్ నుంచి పక్కకు వచ్చేసి రిలాక్స్ అవుతారనే అపవాదు ఉంది. బిగ్ బాస్ స్క్రిప్టు ప్రకారం జరిగేది కాదు, ప్రేక్షకులను ఎంటర్టెన్ చేద్దామనే స్ట్రాటజీ కూడా ఇంటి సభ్యులకు లేదు.
ఇంట్లో లవర్స్‌లా ముద్రపడ్డ వారి మధ్య నిజమైన లవ్ ఉందని చెప్పడం కష్టం. మనం చిన్నపుడు స్కూల్లో ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నా, క్లోజ్‌గా ఉన్నా వారి మధ్య ఏదో ఉందని అంతా గుసుగుసలు మొదలు పెడతారు.