బిగ్ బాస్ హౌస్ లో తనకు ఆరోగ్యం అసలు బాలేదని, లోపల అదోలా అనిపిస్తుందని భర్త విక్కీతో చెప్పుకొచ్చింది అంకితా. తనకు పీరియడ్స్ రాలేదని, ఇంటికి వెళ్లిపోవాలని అనిపిస్తుందని కూడా తెలిపింది. తను ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవడం కోసం డాక్టర్లు తనకు బ్లడ్ టెస్ట్‌తో పాటు యూరిన్ టెస్ట్ కూడా చేశారని బయటపెట్టింది. తన ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండడం లేదని కూడా అంకితా చెప్పింది. పూర్తీ వివలోకి వెళ్తే బిగ్ బాస్ తెలుగుతో పాటు హిందీలో కూడా ప్రసారం అవుతోన్న సంగతి తెలిసిందే.
హిందీలో ప్రస్తుతం బిగ్ బాస్ 17 షురూ అయ్యింది. అక్కడ అదిరే రేటింగ్‌తో కేక పెట్టిస్తోంది. అంతేకాదు ఈ షో మొదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. తెలుగులో నాగార్జున హోస్ట్ చేస్తుంటే.. హిందీలో మాత్రం సల్మాన్ చేస్తున్నారు. ఇక విషయం ఏమంటే.. షోలో పాల్గోనడానికి వచ్చిన ఓ కంటెస్టెంట్ గర్భం దాల్చిందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీజన్‌లో హిందీ నటి అంకితా లోఖండే తన భర్త విక్కీ జైన్‌తో కలిసి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే అంకిత తాజాగా తనకు ఈ మధ్య బాగా లేదని.. ఏదో తప్పు జరిగిందని అతనికి అనిపిస్తుందని… తనకు పీరియడ్స్ రాలేదని, ఇంటికి వెళ్లాలనుకుంటున్నానని తన భర్తతో చెప్పింది. తను గర్భవతిగా ఉందో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయించుకున్నట్లు అంకిత వెల్లడించింది. వైద్యులు మూత్ర పరీక్షలు కూడా చేశారని ఆమె చెప్పింది. దీంతో త్వరలో ఓ గుడ్ న్యూస్ రాబోతుందని.. హిందీ బిగ్ బాస్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.