కుమారి ఆంటీ అనూహ్యంగా పాప్యులర్ అయ్యారు. దశాబ్దానికి పైగా కుమారి ఆంటీ హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో ఆమె భోజనం అందిస్తున్నారు. రోజుకు వందల మంది ఆమె వద్ద భోజనం చేస్తారు. అయితే కుమారి ఆంటీ ఫేమ్ చూసి సీరియల్ నటి కీర్తి భట్ కాబోయే భర్త కార్తీక్ తో పాటు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లారు. కానీ కుమారి ఆంటీ లేదట. ఇక ఫుడ్ అయినా టేస్ట్ చేద్దాం అనుకుని ఒక ప్లేట్ చికెన్ రైస్ తీసుకున్నారట. అయితే చికెన్ చాలా కారంగా ఉండటంతో కీర్తి తినలేకపోయిందట.
పక్కనే ఉన్న మరో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గర భోజనం చేశారట. కుమారి ఆంటీ ఫుడ్ కంటే అది కాస్త బెటర్ గా ఉందని కీర్తి అసహనం వ్యక్తం చేసింది. కుమారి ఆంటీ వద్దకు అంత మంది జనాలు ఎందుకు వస్తున్నారో తెలియదు. ఫుడ్ టేస్ట్ గా లేదు. పైగా కాస్త వైట్ రైస్ నాలుగు చికెన్ ముక్కలు వేసి రూ.170 తీసుకుంటున్నారు. ఆ అమౌంట్ ఫుడ్ కి వర్త్ కాదు అని కీర్తి తెలిపింది. కుమారి ఆంటీ కంటే చికెన్ తానే బాగా చేస్తానని అంది.
ఇలా అంటున్నాను అని తప్పుగా అనుకోకండి. ఇది మా అభిప్రాయం. మాకు నచ్చలేదని మీకు నచ్చదని కాదు. ఆమె బిజినెస్ గురించి చెడుగా చెప్పాలని కాదు. కుమారి ఆంటీ చాలా కష్టపడుతున్నారు. ఆమె ఇలాగే ఇంకా గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ కీర్తి చెప్పుకొచ్చింది. అయితే కీర్తి సురేష్ నెగిటివ్ రివ్యూ వైరల్ అవుతుంది. కీర్తి కామెంట్స్ కుమారి ఆంటీ వ్యాపారాన్ని దెబ్బ తీసే అవకాశం కలదని ఆమె అభిమానులు వాపోతున్నారు.