బిగ్ బాస్ షోలో సంచలనం. ఆ కంటెస్టెంట్‌ అరెస్ట్..! ఏమైందంటే..?

ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షాకాదరణ పొందుతున్న షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇది హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు, తమిళ్ లో సీజన్ 7 నడుస్తుంది. కన్నడ భాషలో మాత్రం సీజన్ 10 నడుస్తోంది. అయితే బిగ్‏బాస్ హౌస్ లో గొడవలు తెలుగు షోలో కాస్త తక్కువే ఉంటాయి. గతంలో హిందీ బిగ్‏బాస్ షోలో గొడవలు కావడం.. కంటెస్టెంట్లను మధ్యలోనే ఎలిమినేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కన్నడ షోలో ఎక్కువగా వివాదాలు జరుగుతున్నాయి.

తాజాగా బిగ్‏బాస్ కన్నడ సీజన్ 10లో పాల్గొంటున్న కంటెస్టెంట్ నటి తనీషా కుప్పండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద్ ఎఫ్ఐఆర్ నమోదైంది. కన్నడ బిగ్‏బాస్ సీజన్ 10కి నటుడు సుధీప్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల నవంబర్ 8న ప్రసారమైన షోలో.. నటి తనీషా కుప్పండ తన తోటి కంటెస్టెంట్ డ్రోన్ ప్రతాప్‏ను ‘వడ్డా’ అని పిలిచింది. దీంతో అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు భోవి సమాజ్ పి పద్మ బెంగళూరు శివార్లలోని కుంబళగోడు పోలీస్ స్టేషన్‌లో నటి తనీషాపై ఫిర్యాదు చేశారు. తానీషా భోవి కమ్యూనిటీని కించపరిచే విధంగా మాట్లాడారని పద్మ ఆరోపించింది. తనీషాతోపాటు సదరు టీవీ ఛానెల్ పై పోలీసు కేసు పెట్టింది. ఈ క్రమంలోనే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కేసు నమోదవడంతో, తనీషా బిగ్ బాస్ హౌస్ నుండి కొంతకాలం ఎవిక్షన్ కావడం లేదా డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘వడ్డా’ అనేది షెడ్యూల్డ్ కులాల విభాగంలోకి వచ్చే భోవి సంఘంలో ఓ భాగం. ఇప్పటికే బిగ్‏బాస్ షోలో ఇలా భోవి వర్గాన్ని కించపరుస్తూ కామెంట్స్ చేయడం ఇది రెండోసారి. గత సీజన్ లో నటుడు సిహి కహీ చంద్రు కూడా ఇదే పదాన్నీ ఉపయోగించాడు. కానీ ఆ తర్వాత అతనుడ క్షమాపణలు చెప్పాడని పద్మ గుర్తుచేశారు. ఇక బిగ్‏బాస్ సీజన్ 10 ప్రారంభంలోనే మరో కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్‌ పులి గోరు లాకెట్ ధరించినందుకు అతడిని షో మధ్యలోనే అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *