బిగ్ బాస్ ఇప్పటికే 6 సీజన్ లను పూర్తి చేసుకుంది. అన్నింటికంటే ఆరవ సీజన్ కు తక్కువ ప్రేక్షకాదరణ వచ్చినట్టు టాక్. అంతకంటే ముందు ప్రసారమైన 5వ సీజన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 5,6వ సీజన్ల ఫలితంగా యాజమాన్యం సీరియస్ గా ఆలోచించి ఉల్టాఫుల్టా అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీజన్ ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయడంలో విఫలం కాలేదు. మంచి ప్రేక్షకాధరణతో ముందుకు సాగుతుంది. అయితే కెప్టెన్సీ విషయంలో,టాస్కుల్లో ఆమెకి లక్ కలసి వచ్చింది అని.. ఆమె పీకింది పెద్దగా ఏమిలేదని అర్జున్ పేర్కొన్నాడు.
దీనితో శోభా శెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. నా కష్టాన్ని లక్ అనే చిన్న మాటతో తీసి పడేస్తే ఎలా అని ఏడ్చింది. ఇక ప్రియాంక కి 4 వ ర్యాంక్, ప్రశాంత్ కి 3 దక్కాయి. అయితే ప్రశాంత్ విషయంలో రతికా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రశాంత్ మొదటి నాలుగు వారాలు పీకింది ఏమీ లేదు. నా వల్లే అతడికి కలసి వచ్చింది అని గొడవ చేసింది. దీనితో ప్రశాంత్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. నాకు సాయం చేసింది నువ్వు కాదు అన్న శివాజీ. జీవితాంతం మరచిపోను అని చెప్పాడు.

నువ్వు నన్ను నా ఇంట్లో వాళ్ళని అనరాని మాటలు అన్నావ్ అని ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇక శివాజీ నెంబర్ 1 ర్యాంక్ దక్కింది. యావర్ 2, అర్జున్ 8, గౌతమ్ 7 ర్యాంక్స్ దక్కాయి. అయితే బాటమ్ 5 లో ఉన్న వారు ఎవిక్షన్ పాస్ గెలుచుకునే టాస్క్ లో పాల్గొంటారు అని బిగ్ బాస్ ప్రకటించారు. అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక 6 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు కాబట్టి వీరు టాస్క్ లో పాల్గొన్నారు. ఎవిక్షన్ అని రాసి ఉన్న బ్రిక్స్ ని కరెక్ట్ గా సెట్ చేసి గంట మోగించిన వారు విజేత. ఈ టాస్క్ లో అర్జున్ విజయం సాధించి ఎవిక్షన్ పాస్ గెలిచేశాడు.