అక్కడి స్త్రీలకు మగాళ్లు దొరికారంటే అంతే..! బట్టలు చించేసి..ఏం చేస్తారో తెలుసుకోండి.

విచిత్రమైన ఆచారాలు, సంప్రదాయాలతో నిండి ఉంది. నేటికీ ఈ ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రపంచంలో తమ పాత సంప్రదాయాలలో జీవించే వ్యక్తులు ఉన్నారు. వారి జీవన విధానం , సంప్రదాయాలు చాలా ప్రమాదకరమైనవి, వారి గురించి విన్న తర్వాత మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పర్వదినానికి ప్రత్యేక నేపథ్యంతో పాటు వివిధ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. అలాగే రంగుల పండుగ హోలీ.. కేవలం సంతోషకరమైన వేడుకలకు మాత్రమే పరిమితం కాదు.

హోలీ పండగ అనేది ఆశీర్వాదాలు, కోరికలను నెరవేర్చుకోవడానికి సరైన సమయం. చిన్నా, పెద్ద అందరూ కలిసి హోలీ పండగను సూపర్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఖుషీ ఖుషీగా ఈ వేడుక చేసుకుంటారు. రంగురంగుల రంగేలీ హోలీని దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. అయితే మన దేశంలోని ఓ ప్రదేశంలో మాత్రం హోలీ పండగను చాలా డిఫరెంట్‌గా జరుపుకుంటారు. హోలీ పండుగకు బర్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి. ఇక్కడ హోలీ రోజున రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే క్రీడను ఆడతారు.

లాత్ మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు. అయితే పురుషులు మాత్రం ఆ లాఠీ దెబ్బలు తమపై పడకుండా డాలు లేదా షీల్డ్‌తో తమను తాము రక్షించుకుంటారు. మహిళలంతా హోలీ పాటలను పాడుకుంటూ, పెద్దగా శ్రీ రాదే లేదా శ్రీ కృష్ణ అంటూ ఆడతారు. పరిశుద్ధమైన బ్రజ్ భాషలో బ్రజ్ మండలం హోలీ పాటలను పాడతారు. పక్కనే ఉన్న నందగావ్ గ్రామం నుంచి వచ్చే పురుషుల కోసం మహిళలంతా కర్రలతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పురుషులు ఊరిలోకి అడుగు పెట్టగానే లాఠీలతో తరుముతూ రంగులు పులుముతూ పరుగులు పెడుతూ సందడి చేస్తారు.

ఈ సంప్రదాయం శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథకు అనుసంధానంగా చెప్పుకుంటారు. ఈ రోజున బర్సానలో చిన్న చిన్న యుద్ధ పోటీలు, పాటలు, నృత్యాలు, కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇక మరో ప్రదేశం అయిన మధుర సమీపంలో దౌజీ అనే గ్రామంలో హోలీ మరుసటి రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో పురుషులు, స్త్రీలు రంగులు జల్లుకోవడంతో పాటు.. స్త్రీలు, మగాళ్ల బట్టలను చింపేయడం లాంటివి చేస్తారు. ఎంతో కోలాహలంగా ఈ వేడుక జరుపుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *