బర్రెలక్క కన్నీళ్లు చూసి వచ్చాను..! ఇప్పుడు రండిరా చూసుకుందాం.!

మంగళవారంన కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క(శిరీష) తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహింస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు. అయితే సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన బర్రెలక్క అలియస్ కర్నె శిరీష ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన విషయం తెలిసిందే.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేసిన శిరీష ఉద్యోగం లేకపోవడంతో గేదెలు కాస్తుండడంతో అందరూ ఆమెను బర్రెలక్కగా పిలవడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న బర్రెలక్కకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. నిరుద్యోగులకు న్యాయం జరగాలని తాము పోరాడుతున్నామని.. యువత, నిరుద్యోగుల తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నానని ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బర్రెలక్క.

తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఆమె కోరారు. దాడి ఘటనపై ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేస్తామని బర్రెలక్క తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. నిరుద్యోగ యువత కోసం పోరాడుతామని కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క తెలిపారు. కాగా, ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి కూడా ఆమెకు మంచి స్పందన వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *