త్వరలో తల్లి కాబోతున్న సమంత, ఒకే సారి ఇద్దరి పిల్లలకి అమ్మ కాబోతున్న సామ్.

నాగచైతన్యతో విడిపోయిన సమంత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా ఆమె మరో పెళ్లికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ఈ క్రమంలోనే ఆమెను ఒంటరిగా చూడలేక ఎంతోమంది ఫ్యాన్స్ మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఏడాది నుంచి ఈ వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటున్న ఇంకా క్యూర్ కాలేదు. ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలలో ట్రీట్మెంట్ కోసం వెళ్లారు.

ఇదిలా ఉండగా 36 ఏళ్ల వయసు దాటిపోవడంతో సమంత కి మళ్లీ పెళ్లి చేయాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారట. అయితే సమంత మాత్రం తన జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యారట. ఇకపై ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారట. సమంత నటిగా, సోషల్ వర్క్ కు అంకితం చేయబోతున్నట్లు తెలుస్తుంది. తల్లి కావాలన్నా ఆమె కోరిక కి భవిష్యత్తులో ఇద్దరు పిల్లలు దత్తత తీసుకొని, వారికి తల్లిగా ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉండాలని సమంత నిర్ణయం తీసుకుందట.

అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సమంత 2014 నుంచి ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ రన్ చేస్తూ ఆడపిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లలో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని అమ్మ అవుతారని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *